ఢిల్లీతో పాటు ముంబైలో కూడా పెరిగిన కరోనా కేసులు.. ఇండియా కరోనా అప్డేట్స్ ఇవిగో!
- భారత్ లో గత 24 గంటల్లో 2,067 కేసులు
- ముంబైలో 85 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 40 మంది మృతి
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మళ్లీ ఒకే రోజులో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,067 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. దేశ రాజధానిలో 632 కేసులు నమోదు కాగా... కేరళలో 488 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 85 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 2 తర్వాత ముంబైలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
గత 24 గంటల్లో రికవరీల కంటే కరోనా కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం 1,547 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో 40 మంది మరణించారు. అంతకు ముందు రోజు మృతుల సంఖ్య 34గా ఉంది. ప్రస్తుతం దేశంలో 12,340 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 186 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.