నిరసన దీక్షకు దిగిన బండి సంజయ్
- టీఆర్ఎస్ తీరు, రాష్ట్రంలో ఆత్మహత్యలపై సంజయ్ ఆగ్రహం
- నిజాం కాలం నాటి అరాచకాలు ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్య
- కేసీఆర్ బయటకు వచ్చి ఆ ఘటనలను ఖండించాలని డిమాండ్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోన్న నేపథ్యంలో నిన్న జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వేములలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన పాదయాత్రను కొంత మంది టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
దీంతో టీఆర్ఎస్ ప్రదర్శిస్తోన్న తీరు, రాష్ట్రంలో ఆత్మహత్యలు, హత్యాచారాలకు వ్యతిరేకంగా మల్దకల్ పాదయాత్ర శిబిరం వద్ద పలువురు బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిజాం కాలం నాటి అరాచకాలను టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మళ్లీ చూపిస్తున్నారని అన్నారు.
టీఆర్ఎస్ నేతల అరాచకాలకు వ్యతిరేకంగా సాయి గణేశ్ పోరాడారని బండి సంజయ్ చెప్పారు. దీంతో ఆయనను పోలీసులు వేధింపులకు గురి చేశారని, దాంతో సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. అతడి నుంచి ఆసుపత్రిలో మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సాయి గణేశ్ ది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్య అని బండి సంజయ్ అన్నారు.
అలాగే, రామాయం పేట ఘటన, కోదాడ అత్యాచార ఘటన వెనుక టీఆర్ఎస్ నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు. వామనరావు దంపతుల హత్య వెనక ఉన్నది కూడా టీఆర్ఎస్ నేతలే అని అన్నారు. ఈ ఘటనలపై సీఎం కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ బయటకు వచ్చి ఆ ఘటనలను ఖండించాలని అన్నారు. బాధితుల తరఫున తమ పార్టీ న్యాయపోరాటం కొనసాగిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.