'రాధే శ్యామ్' సినిమా హిట్ కాకపోవడంపై తొలిసారి స్పందించిన ప్రభాస్!
- కరోనా లేదా స్క్రిప్ట్ లో ఏదైనా మిస్ కావడం కారణం కావచ్చన్న ప్రభాస్
- ఒకవేళ అలాంటి జోనర్ లో నన్ను చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదేమోనని వ్యాఖ్య
- కొందరు నన్ను బాహుబలి లాంటి పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారని వెల్లడి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అందాల భామ పూజాహెగ్డే నటించిన 'రాధే శ్యామ్' భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ప్రేక్షకులను మాత్రం పెద్దగా అలరించలేకపోయింది. తన సినిమా వైఫల్యంపై ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ప్రభాస్... సినిమా రిజల్ట్ పై ఇప్పుడు తొలిసారి స్పందించాడు.
కరోనా కారణంగా సినీ అభిమానులు టీవీ, ఇతర ప్లాట్ ఫామ్ లకు అలవాటు పడ్డారని... కాబట్టి టెలివిజన్ స్క్రీన్ పై 'రాధే శ్యామ్' ను ఇష్టపడతారని భావిస్తున్నట్టు ప్రభాస్ చెప్పాడు. కుటుంబం మొత్తం టీవీ ముందు కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తారని తెలిపాడు. సినిమా భారీ కలెక్షన్లను సాధించలేక పోవడానికి కారణం కరోనా కావొచ్చు.. లేదా స్క్రిప్ట్ లో ఏదైనా మిస్ అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. లేదా అలాంటి జోనర్ లో తనను చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదేమో అని కూడా అన్నాడు. లేదా తాను ఇంకా బాగుండాలని అనుకొని ఉండొచ్చని చెప్పాడు.
'బాహుబలి'గా రాజమౌళి తనను ప్రపంచానికి పరిచయం చేశారని... కొందరు తనను బాహుబలి లాంటి పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారని ప్రభాస్ అన్నాడు. అయితే విభిన్న పాత్రలను పోషించాలని, మంచి కంటెంట్ తో కూడిన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నానని చెప్పాడు. తన సినిమాలకు 'బాహుబలి' లాంటి రెస్పాన్స్ రావాలనే ఒత్తిడి దర్శకులు, నిర్మాతలపై ఉందని అన్నాడు. తన వరకైతే అలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు.