శ్రీలంకలో నిరసనకారులపై కాల్పులు జరిపిన పోలీసులు... ఒకరి మృతి
- శ్రీలంకలో భగ్గుమన్న ప్రజాగ్రహం
- రాంబుక్కన వద్ద రహదారి దిగ్బంధనం
- కాల్పులు జరిపిన పోలీసులు
- రబ్బరు బుల్లెట్లకు బదులు నిజమైన బుల్లెట్లతో కాల్పులు
- 10 మంది గాయాలు
శ్రీలంకలో పెట్రో ధరలు భగ్గుమంటుండడం, నిత్యావసరాల కొరతపై నిరసనకారులు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. అయితే, పరిస్థితిని అదుపు చేసే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. రాంబుక్కన ప్రాంతంలో ఓ రహదారిని దిగ్బంధించిన ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. అయితే పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో పోలీసులు రబ్బరు బుల్లెట్లకు బదులు నిజమైన తూటాలు ఉపయోగించడంతో ఆందోళనకారుల్లో ఒకరు మరణించారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.
దేశంలో ఇవాళ 92 ఆక్టేన్ పెట్రోల్ ధర ఒక్కసారిగా రూ.84 పెరిగి రూ.338కి చేరింది. దాంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. దానికితోడు ఆసుపత్రుల్లో పరికరాలు, ఔషధాల కొరతతో వైద్యం కూడా అందని దుస్థితి నెలకొంది. దాంతో, వందల సంఖ్యలో నిరసనకారులు రాంబుక్కన వద్ద గుమికూడారు. రాజధాని కొలంబోకు దారితీసే రహదారిపై నిరసన చేపట్టారు. టైర్లు దగ్ధం చేసి రహదారిని మూసేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు తుపాకులకు పనిచెప్పారు.