పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్

  • కాజల్, గౌతమ్ దంపతులకు కొడుకు
  • 2020లో గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన కాజల్
  • జనవరి 8న తాను గర్భవతినంటూ ప్రకటన
  • క్రమం తప్పకుండా అప్ డేట్లు ఇస్తున్న కాజల్
నటి కాజల్ అగర్వాల్ తల్లయింది. కాజల్ నేడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో వీరి పెళ్లి జరిగింది. జనవరి 8న తాను గర్భవతినంటూ కాజల్ ప్రకటించింది. అప్పటినుంచి తన గర్భానికి సంబంధించిన అనేక సంగతులను కాజల్ క్రమం తప్పకుండా అభిమానులతో ఫొటోల రూపంలో పంచుకుంటోంది. తాజాగా కాజల్ కు కొడుకు పుట్టాడన్న వార్తతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి యువరాజు పుట్టాడంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


More Telugu News