ఎంజీఆర్ తో నాన్నకు జరిగిన గొడవను వెబ్ సిరీస్ గా చేస్తున్నాను: నటి రాధిక
- ఎంజీఆర్ తో ఎం.ఆర్ రాధాకి గొడవలు
- ఇద్దరి మధ్య కాల్పుల ఘటన
- దానికి సంబంధించిన కథపై కసరత్తు
- జులై నుంచి షూటింగ్ మొదలన్న రాధిక
1980లలో తెలుగు తెరపై సందడి చేసిన కథానాయికలలో రాధిక ఒకరు. అప్పట్లో గట్టిపోటీ ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడ్డారు. ఆమె తండ్రి ఎం.ఆర్. రాధా హీరోగానే కాదు .. పవర్ఫుల్ విలన్ గా కూడా ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లో ఆయనకి ఎంజీఆర్ తో గొడవలు ఉండేవి. ఆ విషయాలను గురించి 'ఆలీతో సరదాగా'లో రాధిక ప్రస్తావించారు.
"మా ఫాదర్ వివాదాస్పదమైన వ్యక్తి అనే విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనకీ .. ఎంజీఆర్ కి ఏవో గొడవలు ఉండేవి. వాళ్లిద్దరి మధ్య చోటుచేసుకున్న కాల్పుల సంఘటన గురించి చాలామందికి తెలుసు. ఆ సంఘటన నేపథ్యంలోనే ఒక వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
జులై నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. నా కెరియర్ నా చేతిలో ఉండాలనే ఉద్దేశంతోనే 'రాడాన్' సంస్థను స్థాపించాను. మా బ్యానర్ మంచి పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. మా బ్యానర్ ద్వారా మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలనే ఆలోచనలో ఉన్నాము" అని చెప్పుకొచ్చారు.