శ్రీలంకలో ఒకేసారి రూ. 84 మేర పెరిగిన పెట్రోల్.. మండిపడుతున్న జనం!
- తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక
- ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- రూ. 338కి పెరిగిన లీటర్ పెట్రోల్ ధర
ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 338కి చేరుకుంది. ఆ దేశానికి చెందిన లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్ఐఓసీ) నిన్న చమురు ధరలను పెంచింది. దీనికి అనుగుణంగా నిన్న అర్ధరాత్రి సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ 92 ఆక్టేన్ పెట్రోల్ ధరనే ఏకంగా రూ. 84 మేర పెంచేసింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 338కి చేరుకుంది. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలపై లంక ప్రజలు మండిపడుతున్నారు.