మ‌హిళా కాంగ్రెస్‌లో కీల‌క ప‌రిణామం... హైదరాబాద్ సిటీ చీఫ్ ప‌ద‌వి నుంచి క‌విత తొల‌గింపు

  • ఇటీవ‌ల సునీతారావు, క‌విత‌ల మ‌ధ్య గాంధీ భ‌వ‌న్‌లో ఘ‌ర్ష‌ణ‌
  • ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ మ‌హిళా కాంగ్రెస్
  • క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగానే ‌కవితపై వేటు
తెలంగాణ కాంగ్రెస్‌లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మ‌హిళా కాంగ్రెస్ హైద‌రాబాద్ న‌గ‌ర అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్న క‌విత‌ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించారు. ఈ మేర‌కు మ‌హిళా కాంగ్రెస్ మంగ‌ళ‌వారం నాడు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

క‌విత‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డానికి ఓ ప్ర‌ధాన కార‌ణ‌మే ఉంది. ఇటీవ‌ల గాంధీభ‌వ‌న్ వేదిక‌గా మ‌హిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షురాలు సునీతా రావుతో క‌విత వాగ్వాదానికి దిగారు. ఈ ఘ‌ర్ష‌ణ పార్టీ శ్రేణులను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. 

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన మ‌హిళా కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా క‌విత‌ను సిటీ చీఫ్ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం క‌విత‌ను పార్టీ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ ప్ర‌క‌ట‌న కూడా జారీ చేసింది.


More Telugu News