ఏపీలో బ్రిటీషర్ల తర్వాత మళ్లీ భూ సర్వే చేయలేదు: సీసీఎల్ఏ కమిషనర్ సాయిప్రసాద్
- ఏపీలో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వ కార్యాచరణ
- 30 ఏళ్లకోసారి రీసర్వే చేయాల్సి ఉందన్న కమిషనర్
- రీసర్వేను సీఎం పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడి
- భూ రికార్డులన్నీ అప్ డేట్ చేయాల్సి ఉందని స్పష్టీకరణ
ఏపీలో సమగ్ర భూ సర్వే కోసం ప్రభుత్వం భారీ ఎత్తున కార్యాచరణ రూపొందించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూ పరిపాలనా శాఖ (సీసీఎల్ఏ) కమిషనర్ సాయిప్రసాద్ స్పందించారు. రాష్ట్రంలో బ్రిటీష్ వాళ్లు సర్వే చేసిన తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఎవరూ సమగ్ర సర్వే చేయలేదని వెల్లడించారు. గట్టు వివాదాలు వస్తాయని ఎవరూ సర్వేల జోలికి వెళ్లడంలేదని అభిప్రాయపడ్డారు. భూములు ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూముల రీసర్వేపై సీఎం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని భూ రికార్డులన్నీ అప్ డేట్ చేయాల్సి ఉందని, అయితే కోర్టులో వివాదాలు ఉన్నవాటిని మినహాయించి మిగతా అన్నింటిని పరిష్కరించి రీసర్వే చేస్తామని సాయిప్రసాద్ చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, సర్వే పూర్తయ్యాక రోజువారీ మ్యుటేషన్లు చేపడతామని వెల్లడించారు. తహసీల్దార్ తో సంబంధం లేకుండా ఆటో మ్యుటేషన్లు ఉంటాయని, రిజిస్ట్రేషన్ జరగ్గానే ఆటో మ్యుటేషన్ జరిగిపోతుందని వివరించారు.