కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు మహిళల మానప్రాణాలు తీసి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నడు: షర్మిల
- టీఆర్ఎస్ అరాచకాలు తట్టుకోలేక తల్లీకొడుకులు ఒళ్లు కాల్చుకున్నారని షర్మిల ఆగ్రహం
- కమీషన్లు, లంచాలతో పాటు ఆడవాళ్ల మానం కూడా అడుగుతున్నారని ఆరోపణ
- టీఆర్ఎస్ నేతలు మనుషులా? మృగాలా? అని ప్రశ్న
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై వైఎస్సార్‌సీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. ''సింగరేణిని కేసీఆర్ దివాలా తీసిండు. రూ.3 వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సంస్థను రూ.8 వేల కోట్ల అప్పులపాలు జేసిండు. 60 వేల మంది కార్మికులతో కళకళలాడే సింగరేణి.. నేడు 40 వేల మందికి తగ్గిపోయింది. సింగరేణి ఆస్తుల్ని కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నడు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కేసీఆర్ నోరెత్తలె. టీఆర్ఎస్ అరాచకాలు తట్టుకోలేక తల్లీకొడుకులు ఒళ్లు కాల్చుకున్నారంటే దానికి కారణం కేసీఆర్. కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు మహిళల మానప్రాణాలు తీసి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నడు. కమీషన్లు, లంచాలతో పాటు ఆడవాళ్ల మానం కూడా అడుగుతున్నారంటే వాళ్లు మనుషులా?మృగాలా?
రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గూండాల రాజ్యం నడుస్తోంది. కబ్జాలు, సెటిల్మెంట్లకు తోడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నరు. కేసీఆర్‌కు తెలిసిందల్లా గారడి మాటలు, గలీజు తిట్లు. ఎన్నికలు రాగానే దొంగ మాటలు చెప్పడం, ఓట్లు వేయించుకోవడం, ఫామ్ హౌస్‌కు వెళ్లిపోవడం. ఇదే జరుగుతోంది'' అని షర్మిల విమర్శలు గుప్పించారు.