ప్రపంచానికి ఆదర్శం భారత స్వాతంత్ర్య సంగ్రామం: ఉపరాష్ట్రపతి వెంకయ్య
- అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించిన వెంకయ్య
- ఆయన్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచన
- సమరయోధుల జీవితాన్ని అధ్యయనం చేయాలని పిలుపు
విశాఖపట్టణంలోని పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు రూపాకుల దంపతుల విగ్రహాలను బర్లపేటలో ఆయన ఆవిష్కరించారు. అల్లూరి ఆత్మవిశ్వాసం, తెగువ, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛా ఇతిహాసమే భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర అని చెప్పారు. కాబట్టి స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రను యువత అధ్యయనం చేయాలని సూచించారు. వివక్షలకు తావులేని నవ భారత నిర్మాణమే స్వరాజ్య సమరయోధులకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.