ఫించ్ పై ప్రసిద్ధ్ కృష్ణ బూతులు.. మండిపడుతున్న నెటిజన్లు
- రాజస్థాన్ చేతిలో ఓడిన కోల్ కతా
- ఫించ్ వికెట్ తీసిన ప్రసిద్ధ్
- ఇద్దరి మధ్యా మాటల యుద్ధం
- ప్రసిద్ధ్ కు స్లెడ్జ్ చేయడం కొత్తేం కాదంటూ నెటిజన్ల ఆగ్రహం
- 2015 నాటి ప్రసిద్ధ్ కాదంటూ వ్యాఖ్యలు
నిన్న కోల్ కతా త్రుటిలో మ్యాచ్ ఓడిపోయిందిగానీ.. నిజం చెప్పాలంటే అసలు మొదటి నుంచీ గేమ్ లో ఉంది కోల్ కతానే. అవును మరి, రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు.. ఆదిలోనే సునీల్ నరైన్ రూపంలో పెద్ద పోటే తగిలినా ఆరోన్ ఫించ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లు ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ తో లక్ష్యం వైపు జట్టు వడివడిగా అడుగులు వేసింది.
అయితే, ఇంతలోనే భారీ కుదుపుకు లోనైంది కోల్ కతా. 9వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో చివరి బంతికి ఓపెనర్ ఫించ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 58 పరుగులు చేసి మాంచి ఫైర్ మీదున్న అతడు అవుటయ్యే సరికి కోల్ కతా ఇన్నింగ్స్ గాడి తప్పింది.
అయితే, పోతూపోతూ ప్రసిద్ధ్ కృష్ణ వైపు చూస్తూ ఫించ్ ఏదో అన్నాడు. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఫించ్ నుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కొన్ని బూతులూ మాట్లాడాడు. అయితే, ప్రసిద్ధ్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
కుల్దీప్ లాగానే ప్రసిద్ధ్ కు కూడా బెల్ట్ ట్రీట్ మెంట్ ఇవ్వాలంటున్నారు. ఎవరైనా బ్యాటర్ తన బౌలింగ్ లో హిట్టింగ్ చేస్తే ప్రసిద్ధ్ కృష్ణ ఇలాగే మాటలతో స్లెడ్జ్ చేస్తాడని ఓ యూజర్ రాసుకొచ్చాడు. చెత్త బంతులకే ఆ పనికిమాలిన ప్రసిద్ధ్ కృష్ణకు వికెట్లు పడతాయంటూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు.
ప్రతి విదేశీ ప్లేయర్ తోనూ ప్రసిద్ధ్ కృష్ణ ఎందుకు గొడవ పెట్టుకుంటాడంటూ ఓ మహిళా క్రికెటర్ విమర్శించింది. విదేశీ ఆటగాడిని స్లెడ్జ్ చేయడం తాను చూడడం ఇది మూడోసారని వ్యాఖ్యానించింది. సీనియర్లకు ప్రసిద్ధ్ కొంచెం గౌరవం ఇస్తే బాగుంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు. వికెట్ తీశాక అతడు ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారేం కాదంటున్నారు.
2015లో ఉన్న ప్రసిద్ధ్ కృష్ణకు ఇప్పటి ప్రసిద్ధ్ కు చాలా తేడా ఉందని, చాలా మారిపోయాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా మ్యాచ్ ను కోల్ కతా చేజేతులా చేజార్చుకుంది. చాహల్ హ్యాట్రిక్ సహా ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు కూల్చడంతో కోల్ కతా 210 పరుగులకే ఆలౌట్ అయింది.