ఆ ఆరోపణలపై చర్చకు సిద్ధం: మాజీ మంత్రి బాలినేని సవాలు
- మంత్రి పదవి రేసులో ఉన్నప్పుడు తనపై టీడీపీ నేతలు ఆరోపణలు చేశారన్న బాలినేని
- రూ.1,700 కోట్ల అవినీతికి పాల్పడ్డానని ఆరోపించారన్న మాజీ మంత్రి
- సీఎం వైఎస్ జగన్ ఆలోచనా పరుడని ప్రశంస
- ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసని వ్యాఖ్య
ఏపీ కొత్త కేబినెట్‌లో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ విషయంపై ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ ఆయా అంశాలపై స్పందించారు. తాను మంత్రి పదవి రేసులో ఉన్న సమయంలో తనపై టీడీపీ నేతలు రూ.1,700 కోట్ల అవినీతికి పాల్పడ్డానంటూ ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలపై చర్చకు సిద్ధమని బాలినేని సవాలు విసిరారు.
సీఎం వైఎస్ జగన్ ఆలోచనా పరుడని, ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసని చెప్పారు. ఎవరి బెదిరింపులకో భయపడి మంత్రి పదవి ఇచ్చే వ్యక్తి కాదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా జగన్ ఎదిరించారని అన్నారు.