సుప్రీంకోర్టు 153(ఏ)పై విశ్లేషించిన విధానాన్ని పొలీసు శాఖ పరిశీలించుకోవాలి: వ‌ర్ల రామ‌య్య‌

  • రాష్ట్ర‌ పొలీసు వ్యవస్థ "సవాంగ్ మార్క్" పోలీసింగ్ నుంచి బయటపడాలన్న రామ‌య్య‌
  • ప్రశ్నించే వారిపై 153 (ఏ) ఐపీసీ కేసులు పెట్ట‌డం మానాలని డిమాండ్ 
  • ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా పొలీసులు వ్యవహరించకూడదని వ్యాఖ్య‌
ఆంధ్రప్ర‌దేశ్ పోలీసుల‌పై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య మండిప‌డ్డారు. వైసీపీ ప్ర‌భుత్వ మాట‌లు వింటూ రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేసే చ‌ర్య‌ల‌ను.. పోలీసులు మానుకోవాల‌ని ఆయ‌న సూచించారు.  

''రాష్ట్ర‌ పొలీసు వ్యవస్థ 'సవాంగ్ మార్క్' పోలీసింగ్ నుంచి బయటపడాలి. ప్రశ్నించే వారిపై 153 (ఏ) ఐపీసీ కేసులు పెట్ట‌డం మానాలి. ఇటీవల సుప్రీంకోర్టు 153(ఏ) పై విశ్లేషించిన విధానాన్ని పొలీసు శాఖ ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా పొలీసులు వ్యవహరించకూడదు.. నిష్పాక్షికంగా ఉండాలి'' అని వ‌ర్ల రామ‌య్య ట్వీట్ చేశారు. 


More Telugu News