భారత్ లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- 24 గంటల్లో 1,247 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా ఒకరి మృతి
- యాక్టివ్ కేసుల సంఖ్య 11,860
భారత్ లో కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. గత 24 గంటల్లో 1,247 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 2,183 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా కేసుల్లో 43 శాతం తగ్గుదల కనిపించింది. మరోవైపు దేశం మొత్తంమీద కేవలం ఒక కరోనా మరణం మాత్రమే సంభవించింది. ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యక్తి కరోనాతో చనిపోయారు.
ఇక ఇదే సమయంలో కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటం గమనార్హం. గత 24 గంటల్లో 928 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 186 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల నమోదు అదే స్థాయిలో ఉంది. వరుసగా రెండో రోజు కూడా 500కు పైగా కేసులు నమోదయ్యాయి.