'ఆచార్య' వదిలిన అస్త్రంలా దూసుకుపోతున్న బంజారా సాంగ్!
- 'ఆచార్య'గా చిరంజీవి
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- బంజారా సాంగ్ ను ఆలపించిన శంకర్ మహదేవన్
- ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్
చిరంజీవి - చరణ్ కథానాయకులుగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందింది. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, చరణ్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా నుంచి మరో సింగిల్ వదిలారు.
'భలే భలే బంజారా' అంటూ సాగే ఈ పాటను .. కథలో నక్సలైట్లు నైట్ ఎఫెక్టుతో పాడుకుంటారు. చిరంజీవి .. చరణ్ తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటను వదిలిన 14 గంటల్లోనే 38 లక్షలకి పైగా వ్యూస్ .. 2 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి. ఇంకా అదే జోరుతో ఈ పాట అలా దూసుకుపోతూనే ఉంది.
మణిశర్మ పాటల్లో డ్రమ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా ఈ పాట డ్రమ్స్ తోనే మొదలవుతుంది .. ఊపుతో ఉత్సాహంగా కొనసాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శంకర్ మహదేవన్ .. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. చూస్తుంటే ఈ సినిమాను మణిశర్మ మ్యూజికల్ హిట్ లా నిలబెట్టేలానే ఉన్నాడు.