పితృవియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సీఎం కేసీఆర్ పరామర్శ

  • చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ కన్నుమూత
  • అనారోగ్యంతో బాధపడిన నర్సింహ
  • ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన వైనం
  • చిరుమర్తిని ఓదార్చిన సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ అనారోగ్యంతో కన్నుమూశారు. నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రిలో గత రెండ్రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతోంది. అయితే పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, పితృవియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న చిరుమర్తిని ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ అంత్యక్రియలను రేపు నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో నిర్వహించనున్నారు.


More Telugu News