ఉక్రెయిన్‌పై ర‌ష్యా అణు దాడి చేయొచ్చు.. బ్రిట‌న్ ఇంటెలిజెన్స్ హెచ్చ‌రిక‌

  • కొన‌సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం
  • యుద్ధంపై బ్రిట‌న్ ఇంటెలిజెన్స్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
  • రేపే ర‌ష్యా అణుదాడి చేయొచ్చంటూ వెల్ల‌డి
ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధం ముగింపు ఇప్పుడ‌ప్పుడే జ‌రిగేలా లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌లంటూ ఇరు దేశాలు చెబుతున్నా... యుద్ధం ముగింపు దిశ‌గా మాత్రం అడుగులు ప‌డ‌టం లేదు. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డుతున్న ర‌ష్యా సేన‌లు... సోమ‌వారం నాడు ఉక్రెయిన్‌లోని కీల‌క న‌గ‌రం మ‌రియూపోల్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపించాయి.

తాజాగా ఉక్రెయిన్‌పై ర‌ష్యా మ‌రింత భీక‌రంగా విరుచుకుప‌డే అవ‌కాశాలున్నాయ‌న్న వార్త‌లు భ‌యాందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ మేర‌కు బ్రిటన్ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు బాంబులాంటి ఓ వార్త‌ను విడుద‌ల చేశాయి. ఉక్రెయిన్‌పై ర‌ష్యా అణు బాంబు దాడికి పాల్ప‌డే అవ‌కాశ‌ముందంటూ బ్రిట‌న్ హెచ్చరించింది. ఆ అణుబాంబు దాడి కూడా రేపే (మంగ‌ళ‌వారం) జ‌రిగే అవ‌కాశాలున్నాయంటూ పేర్కొంది. ఈ వార్త నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.


More Telugu News