"సర్ ప్రైజ్" అంటూ కళ్లు మూసుకోమని చెప్పి, కాబోయే భర్త గొంతుకోసిన యువతి
- అనకాపల్లి జిల్లా రావికమతంలో ఘోరం
- రాము నాయుడు, పుష్పలకు ఇటీవల నిశ్చితార్థం
- వచ్చే నెల 28న పెళ్లి
- పెళ్లి ఇష్టంలేని యువతి ఘాతుకం
పెళ్లి ఇష్టం లేని ఓ యువతి దారుణ చర్యకు పాల్పడింది. కాబోయే భర్తను అంతమొందించేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు... అనకాపల్లి జిల్లా రావికమతంలో. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఏమాత్రం ఇష్టంలేని యువతి భయంకరమైన పథక రచన చేసింది.
'నీతో మాట్లాడాలి, ఓసారి రా' అంటూ కాబోయే భర్తకు ఫోన్ చేసింది. వెంటనే ఆ యువకుడు రావడంతో, అతనిని సాయిబాబా గుడి వున్న కొండపైకి తీసుకెళ్లింది. తర్వాత 'సర్ ప్రైజ్' అంటూ కళ్లు మూసుకోవాలని కోరింది. కాబోయే భార్య అడగడంతో అతడు వెంటనే కళ్లు మూసుకున్నాడు.
ఇదే అదనుగా ఆ యువతి తనతో పాటు తెచ్చుకున్న పదునైన చాకుతో అతడి గొంతుకోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. అతడిని అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఆ యువకుడి పేరు రాము నాయుడు, అతడి స్వస్థలం పాడేరు. ఆ యువతిది రావికమతం. వీరి పెళ్లి వచ్చే నెల 28న జరగాల్సి ఉంది. తాజా ఘటన నేపథ్యంలో యువకుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.