ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే... సీడీఎస్‌గా నరవణేకు ఛాన్స్?
- ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న పాండే
- ఈ విభాగం నుంచి తొలి ఆర్మీ చీఫ్‌గా మనోజ్
- సీడీఎస్‌గా నరవణేకు ఛాన్స్ దక్కే అవకాశం
భారత సైనిక దళాధిపతిగా లెఫ్ట్‌నెంట్ జనరల్ మనోజ్ పాండే ఎంపికయ్యారు. భారీ సైనిక దళానికి చెందిన ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న మనోజ్ పాండేను భారత నూతన సైనిక దళాధిపతిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటిదాకా సైనిక దళంలోని పదాతి దళానికి చెందిన వారినే ఆర్మీ చీఫ్‌గా ఎంపిక చేస్తుండగా.. తాజాగా ఇండియన్ ఆర్మీకి చెందిన ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధికారికి ఆర్మీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తుండటం గమనార్హం. ఈ నెల 30న మనోజ్ పాండే భారత ఆర్మీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతున్న నరవణేను భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మనోజ్ పాండేకు ఆర్మీ చీఫ్ పదవీ బాధ్యతలు అప్పగించిన తర్వాత నరవణే సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. అయితే భారత ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండేను ప్రకటించిన కేంద్రం.. నరవణేకు కొత్త పదవిపై మాత్రం ప్రకటన విడుదల చేయలేదు. త్వరలోనే సీడీఎస్‌గా నరవణేను ఎంపిక చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దుర్మరణం చెందిన నాటి నుంచి సీడీఎస్ పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే.