చంద్రబాబు, లోకేశ్‌లపై కల్యాణదుర్గం పీఎస్‌లో కేసు నమోదు
- మంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఈ కారణంగా సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక చిన్నారి మృతి చెందిందంటూ వార్తలు
- ఘటనపై చంద్రబాబు,లోకేశ్‌లు సోషల్ మీడియాలో పోస్టులు
- ఆ పోస్టులపై భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై ఏపీలో పోలీసు కేసు నమోదు అయ్యింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవలే మంత్రి పర్యటన కారణంగా ట్రాఫిక్ నిలిపివేయగా.. ఆసుపత్రికి వెళుతున్న ఓ చిన్నారి ట్రాఫిక్‌లో చిక్కుకుని మృత్యువాత పడ్డట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు, లోకేశ్‌లు ఇద్దరూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల కారణంగానే వారిద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇటీవలే ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కించుకున్న కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ మొన్న కల్యాణ దుర్గం వచ్చిన సందర్భంగా ఆమెకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. అదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో జరిగిన జాప్యం కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే చిన్నారి మృతి చెందిందని వార్తలు వచ్చాయి.
దీనిపై చంద్రబాబు, లోకేశ్‌లు అసత్యాలతో కూడిన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారని భాస్కర్ అనే వ్యక్తి కల్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చంద్రబాబు, లోకేశ్‌లపై కేసు నమోదు చేశారు.