బంజారా హిల్స్ భూ వివాదంపై టీజీ విశ్వప్రసాద్ వివరణ ఇదే
- సినిమా ఆఫీస్ ఓపెనింగ్ కోసం వెళ్లామన్న విశ్వప్రసాద్
- తమ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని వెల్లడి
- ఎవరిపైనా దాడి చేయలేదదన్న విశ్వప్రసాద్
- సాక్ష్యంగా వీడియోలు విడుదల చేసిన వైనం
- పోలీసులకే హాకీ బ్యాట్లు, కత్తులు పెట్టారని కీలక ఆరోపణ
బంజారాహిల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున కలకలం రేపిన భూ వివాదానికి సంబంధించి వివాదంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీజీ విశ్వప్రసాద్ తాజాగా వివరణ ఇచ్చారు. తామేమీ భూ కబ్జా కోసం వెళ్లలేదన్న టీజీ... సినిమా ఆఫీస్ ఓపెనింగ్ కోసం వెళ్లినట్లు తెలిపారు. అంతేకాకుండా తన వెంట అక్కడికి వచ్చిన వారంతా రౌడీలు కాదని చెప్పిన ఆయన.. వారంతా తమ బంధువులేనని వెల్లడించారు.
ఇక ఘటనలో టీజీ అనుచరులు ఆయుధాలతో వీరంగం చేశారన్న వాదనలను కూడా విశ్వప్రసాద్ కొట్టిపారేశారు. అసలు తాము ఆయుధాలే తీసుకెళ్లలేదని, ఎవరిపైనా తాము దాడి చేయలేదని తెలిపారు. తమ వాహనాలను స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిలో పోలీసులే హాకీ బ్యాట్లు, కత్తులను వాటిలో పెట్టారని ఆయన ఆరోపించారు. ఇక తాము దాడి చేయలేదని చెప్పేందుకు ఆయన ఏకంగా వీడియోలను సాక్ష్యాలుగా చూపెట్టారు.