యుద్ధఖైదీల మార్పిడి ద్వారా నన్ను విడిపించండి: పుతిన్ సన్నిహితుడి వీడియో పంచుకున్న ఉక్రెయిన్
- ఉక్రెయిన్ బందీగా విక్టర్ మెద్వెద్చుక్
- పుతిన్ అనుకూలుడిగా మెద్వెద్చుక్ కు గుర్తింపు
- ఉక్రెయిన్ లో రాజకీయవేత్తగా, కుబేరుడిగా ప్రసిద్ధి
ఉక్రెయిన్ లోని మేరియుపోల్ నగరాన్ని హస్తగతం చేసుకున్నామని రష్యా ప్రకటించిన కొన్నిగంటల్లోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ కుబేరుడు, రష్యా అనుకూల రాజకీయవేత్త విక్టర్ మెద్వెద్చుక్ కు సంబంధించిన ఓ వీడియోను ఉక్రెయిన్ తాజాగా విడుదల చేసింది. తాను బందీగా ఉన్నానని, తనను యుద్ధ ఖైదీల మార్పిడి ద్వారా విడుదల చేయాలని మెద్వెద్చుక్ వేడుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు.
"రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీలను కోరేది ఒక్కటే. రష్యా చెరలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు, మేరియుపోల్ పౌరులతో నన్ను మార్పిడి చేసుకోండి. వారిని విడుదల చేసి నన్ను కూడా విడుదల చేయండి" అని మెద్వెద్చుక్ ఆ వీడియోలో సందేశం ఇచ్చాడు. ఆ వీడియోలో మెద్వెద్చుక్ చేతులకు బేడీలతో దర్శనిమిచ్చాడు.
కాగా, ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర మొదలయ్యాక ఉక్రెయిన్ ఇంటిదొంగల పనిబట్టింది. రష్యాకు అనుకూలవాదులుగా ముద్రపడిన అనేకమందిపై కఠినచర్యలు తీసుకుంది. వారిలో విక్టర్ మెద్వెద్చుక్ కూడా ఉన్నారు. రాజకీయవేత్తగానే కాకుండా కుబేరుడిగా కూడా పేరుగాంచిన మెద్వెద్చుక్ ఆస్తులను స్తంభింపజేసింది. 32 అపార్ట్ మెంట్లు, 23 లగ్జరీ విల్లాలు, 30 ప్లాట్లు, 26 కార్లు, ఒక విలాసవంతమైన నౌకను స్వాధీనం చేసుకుంది.