ఎప్పుడో విన్న బీహార్ కథలు.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి: శైలజానాథ్
- జగన్ పాలన ఆటవిక పాలనగా మారుతోందన్న శైలజానాథ్
- దళితులపై దాడులు జరిగితే కేసులు నమోదు చేయడం లేదంటూ విమర్శ
- జగన్ మాట్లాడేది ఒకటి.. చేసేది మరొకటని కామెంట్
ఏపీలో జగన్ పాలన ఆటవిక పాలనగా మారుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. బీహార్లో జరుగుతున్నాయంటూ మనం ఎప్పుడో విన్న కథలు... ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయని అన్నారు. దళిత బిడ్డలు హత్యలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎవరైనా తప్పులను ప్రశ్నిస్తే వారిని కొట్టేందుకు కూడా వెనుకాడటం లేదని మండిపడ్డారు. దళితులపై దాడులు జరగితే కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదని విమర్శించారు.
ఎస్సీ వర్గానికి చెందిన వారిని హోమ్ మంత్రులుగా చేసినా ఎలాంటి ఉపయోగం లేదని... వారంతా నామ్ కే వాస్తే హోం మంత్రులని ఎద్దేవా చేశారు. అందరు మంత్రుల అధికారాలు జగన్ చేతిలోనే ఉంటున్నాయని.. ఆయన ముందు చేతులు కట్టుకోవడం, దండాలు పెట్టడమే మంత్రుల పని అని ఎద్దేవా చేశారు. జగన్ మాట్లాడేది ఒకటి, చేసేది మరొకటని దుయ్యబట్టారు.
లక్షల రూపాయల జీతాలు ఇచ్చి మేపుతున్న సలహాదారుల వల్ల రాష్ట్రానికి, సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. జగన్ ను ఆరాధిస్తేనే స్థలాలు వస్తాయని ఒక మంత్రి వ్యాఖ్యానించడం అత్యంత దారుణమని అన్నారు. విద్యుత్ ధరలు పెంచి సామాన్యులపై మరింత భారాన్ని మోపారని శైలజానాథ్ విమర్శించారు.