కన్నడ స్టార్ యశ్ పై కంగనా రనౌత్ ప్రశంసలు

  • బాక్సాఫీసును కొల్లగొడుతున్న 'కేజీఎఫ్2'
  • భారత్ మిస్ అయిన యాంగ్రీ యంగ్ మేన్ యశ్ అన్న కంగన
  • అమితాబ్ స్థానాన్ని భర్తీ చేశాడని కితాబు
కన్నడ సినీరంగం నిన్నటి వరకు కనీవినీ ఎరుగని సంచలన విజయాలను స్టార్ హీరో యశ్ సొంతం చేసుకున్నాడు. యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కేజీఎఫ్', 'కేజీఎఫ్2' చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీసు దుమ్ము దులిపాయి. యశ్ ను తొలి కన్నడ పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాయి. 

మరోవైపు యశ్ పై బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. కొన్ని దశాబ్దాలుగా భారత్ మిస్ అయిన యాంగ్రీ యంగ్ మేన్ యశ్ అని కితాబునిచ్చింది. డబ్బయిల నుంచి అమితాబ్ బచ్చన్ మిగిల్చిన ఆ శూన్యతను యశ్ భర్తీ చేశాడని తెలిపింది. కంగన వ్యాఖ్యల పట్ల యశ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News