అణు సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష
- ఈ ఏడాది ఉత్తర కొరియా ఇప్పటికే 12 క్షిపణి పరీక్షలు
- ఇప్పుడు మరొకటి నిర్వహించి కలకలం
- ఫ్రంట్‌లైన్ ఆర్టిలరీ యూనిట్ల సామర్థ్యం పెరుగుతుందన్న ఉ.కొరియా మీడియా
ఉత్తర కొరియా దుందుడుకు చర్యలను కొనసాగిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి ఎన్ని హెచ్చరికలు వస్తున్నా ఉత్తర కొరియా తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి కలకలం రేపింది. ఈ ఏడాది ఉత్తర కొరియా ఇప్పటికే 12 క్షిపణి పరీక్షలు నిర్వహించింది.
ఇప్పుడు అణు సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఉత్తర కొరియా కొత్తగా ఓ క్షిపణిని రూపొందించిందని, దాన్నే పరీక్షించిందని ఆ దేశ అధికారిక మీడియా పేర్కొంది. ఈ క్షిపణి ప్రయోగాన్ని కూడా తమ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించారని తెలిపింది. తమ దేశం జరిపిన ఈ తాజా ప్రయోగంతో ఫ్రంట్‌లైన్ ఆర్టిలరీ యూనిట్ల సామర్థ్యం పెరుగుతుందని పేర్కొంది.