రీ షూట్లు చేయడం తప్పేం కాదే: కొరటాల
- మొదలైన 'ఆచార్య' ప్రమోషన్స్
- ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల
- రీ షూట్లు చేయలేదన్న కొరటాల
- అలా చేయడం నేరం కాదంటూ స్పష్టీకరణ
చిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఆచార్య' కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కాజల్ - పూజ హెగ్డే కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. నిరంజన్ రెడ్డి - అవినాష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుని, 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. 'ఆచార్య' రీ షూట్లు జరుపుకున్నట్టుగా వార్తలు వచ్చాయి .. అది నిజమేనా? అనే ప్రశ్న కొరటాలకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఈ సినిమాకి రీ షూట్లు చేయవలసిన అవసరం రాలేదు. అయినా, రీ షూట్లు చేయడమనేది అపరాథమైనట్టుగా చూడకూడదు .. మాట్లాడకూడదు.
దర్శకుడు తాను అనుకున్న సీన్ అనుకున్నట్టుగా రాలేదని ఫీలైతే రీ షూట్ కి వెళ్లడంలో తప్పులేదు. ఆశించిన స్థాయిలో సీన్ రాకపోయినా, ఫరవాలేదులే అని సర్దుకుపోతే అది తప్పు అవుతుంది. బెటర్ మెంట్ కోసం రీ షూట్లు జరుగుతూ ఉంటాయి. అవసరమైతే రీ షూట్లు చేయడానికి నేనూ సిద్ధంగానే ఉంటాను" అని చెప్పుకొచ్చారు.