వెబ్ సిరీస్ రివ్యూ: ఉత్కంఠను రేకెత్తించిన 'గాలివాన'
- జీ 5లో 'గాలివాన'
- ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్
- బలమైన కథాకథనాలు
- ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరం
ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లను కూడా సినిమాల స్థాయిలో నిర్మిస్తున్నారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా రూపొందిస్తున్నారు. తారాగణం ఎంపిక విషయంలోను వెనుకాడటం లేదు. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ గా 'గాలివాన' కనిపిస్తుంది. జీ 5 ఓటీటీ లో ఈ నెల 14 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. సాయికుమార్ .. రాధిక .. ఆశ్రిత వేముగంటి .. చాందినీ చౌదరి .. నందినీ రాయ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.
కొమర్రాజు లంకలో కొమర్రాజు (సాయికుమార్) సరస్వతి (రాధిక) నివసిస్తుంటారు. ఇద్దరూ కూడా ఆ ఊరికి పెద్ద తలకాయల వంటివారే. కొమర్రాజు కూతురు గీత .. సరస్వతి కొడుకు అజయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వైజాగ్ లోని ఈ నూతన వధూవరులు తొలి రాత్రే అత్యంత దారుణంగా హత్యకి గురవుతారు. ఈ విషయం తెలిసి ఇటు కొమర్రాజు కుటుంబ సభ్యులు .. అటు సరస్వతి కుటుంబ సభ్యులు కుప్పకూలిపోతారు.
ఆ రోజు రాత్రి సరస్వతి ఇంటిముందు ఒక కారు ప్రమాదం జరుగుతుంది. గాయపడిన వ్యక్తిని సరస్వతి ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటారు. అప్పుడు అతని జేబులో అజయ్ - గీత ఫొటో దొరుకుతుంది. అతనే వాళ్లను హత్యచేశాడనే విషయం వాళ్లకి స్పష్టమై పోతుంది. కొమర్రాజు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటారు. ప్రమాదానికి గురైన వ్యక్తిని మరుసటి రోజు ఉదయాన్నే పోలీసులకు అప్పగించాలని అంతా నిర్ణయించుకుంటారు. అయితే ఆ రాత్రే అతను హత్యకి గురవుతాడు. ఎవరికి వారు తాము చంపలేదంటే తాము చంపలేదని వాదిస్తూ ఉంటారు. ఈ లోగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అజయ్ - గీత హత్య కేసు విషయమై కొమర్రాజు లంకకు బయల్దేరతారు.
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమ దగ్గరకి వస్తున్నారనే విషయం కొమర్రాజు - సరస్వతిలకు తెలుస్తుంది. తమ పిల్లలు హత్యకు గురికావడం సంగతి అటుంచితే, ఇప్పుడు తమ ముందున్న అపరిచితుడి శవాన్ని ఏం చేయాలనేది వాళ్లకి తలనొప్పిగా మారుతుంది. దాంతో పోలీసులు వచ్చేలోగా ఆ శవాన్ని మాయం చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? ఆ తరువాత ఏం జరుగుతుంది? కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? తెలియాలంటే మిగతా ఎపిసోడ్స్ చూడాల్సిందే.
దాదాపు చాలా పాత్రలను ఫస్టు ఎపిసోడ్ లోనే చూపించారు. కథకు వేయవలసిన పునాదిని ఫస్టు ఎపిసోడ్ లోనే వేశారు. ఇక ఏ ఎపిసోడ్ బ్యాంగ్ ఎక్కడ పడాలో అక్కడే పడింది. ఫస్టు ఎపిసోడ్ చూసినవారు ఆ తరువాత మిగిలిన 6 ఎపిసోడ్స్ ను చూడకుండా ఉండలేరు. శరత్ మరార్ - సమీర్ గోగాటే నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు.
పాత్రల ఎంపిక .. వాటిని తీర్చిదిద్దిన తీరు .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు .. చిత్రీకరణ బాగున్నాయి. 'గాలివాన'లోనే ఈ కథ మొదలవుతుంది .. కొత్త జంట హత్యతో అందరి ఆనందాన్ని తుడిచిపెట్టుకుపోయే ఈ 'గాలివాన' .. ఈ కథకి తగిన టైటిల్ అనిపిస్తుంది. అక్కడక్కడా కాస్త సాగతీతగా అనిపించినా, చివర్లో ఉత్కంఠను పతాకస్థాయికి తీసుకుని వెళ్లారు. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి వెబ్ సిరీస్ లలో ఒకటిగా దీని గురించి చెప్పుకోవచ్చు.
--- పెద్దింటి గోపీకృష్ణ