మిల్ల‌ర్‌కే ఆ క్రెడిట్ ద‌క్కుతుంది: ర‌వీంద్ర‌ జ‌డేజా

  • గుజరాత్ చేతిలో ఓడిన చెన్నై
  • మొద‌ట తాము అద్భుతంగా రాణించామ‌న్న జ‌డేజా
  • గుజరాత్ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్ బాగా రాణించాడ‌ని వ్యాఖ్య‌
  • మిల్ల‌ర్‌ మంచి షాట్లు ఆడాడని ప్ర‌శంస‌
గ‌త రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లతో విజయం సాధించిన విష‌యం తెలిసిందే. డేవిడ్ మిల్లర్ ఈ గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. ఈ నేప‌థ్యంలో చెన్నై జ‌ట్టు సారథి రవీంద్ర జడేజా మీడియాతో మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో మొద‌ట తాము అద్భుతంగా రాణించామ‌ని అన్నాడు. 

తొలి ఆరు ఓవర్లు బౌల‌ర్లు అంత‌గా ప‌రుగులు ఇచ్చుకోలేద‌ని చెప్పాడు. అయితే, ఆ త‌ర్వాత‌ గుజరాత్ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్ బాగా రాణించాడ‌ని, గుజరాత్‌ను గెలిపించిన‌ క్రెడిట్‌ అంతా అత‌డికే దక్కుతుందని తెలిపాడు. మిల్ల‌ర్‌ మంచి షాట్లు ఆడాడని చెప్పాడు. తాము సాధించిన 169 పరుగులు గుజరాత్ ను ఓడించ‌డానికి సరిపోతాయని అనుకున్నట్లు తెలిపాడు. చివరి ఐదు ఓవర్లలో త‌మ ప్రణాళికలను అమలు చేయలేకపోయామ‌ని అన్నాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన క్రిస్ జోర్డాన్ 58 పరుగులిచ్చాడు. అయితే, అతడికి ఉన్న అనుభవంతోనే ఫైనల్‌ ఓవర్‌లో బౌలింగ్‌ ఇచ్చానని జ‌డేజా అన్నాడు. మామూలుగా అత‌డు ఓవర్‌కు దాదాపు 5 యార్కర్లు వేయగలడని, తాజా మ్యాచ్‌లో మాత్రం అది కుదరలేదని చెప్పాడు. 



More Telugu News