చిచ్చురేపిన వీడియో.. కర్ణాటకలో పోలీస్ స్టేషన్‌పై 1000 మంది దాడి
- ప్రార్థనా మందిరంపై కాషాయ జెండా ఎగురుతున్నట్టుగా వీడియో
- దానిని స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడు
- యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడి
- 12 మంది పోలీసులకు గాయాలు
స్టేటస్‌గా పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి చివరికి పోలీస్ స్టేషన్‌పై దాడికి కారణమైంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన ఈ ఘటన హింసకు దారితీసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ యువకుడు ఓ ప్రార్థనా మందిరంపై కాషాయ జెండాను ఎగురవేస్తున్నట్టుగా ఉన్న ఎడిట్ చేసిన వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ వీడియో ఓ గంటలోనే వైరల్ అయింది. దీంతో అతడిని అరెస్ట్ చేయాలంటూ కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
మరోవైపు, వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఓ వర్గానికి చెందిన దాదాపు వెయ్యిమంది అర్ధరాత్రి వేళ హుబ్బళ్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలను ధ్వంసం చేశారు. దాడిలో ఓ ఆలయం అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాదు, సీఐ సహా 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
దీంతో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపు చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. వివాదాస్పద వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన వారిలో 45 మందిని అరెస్ట్ చేశారు. వారి దాడిలో గాయపడిన నలుగురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.