ఉమ్రాన్ మాలిక్‌ను అర్జెంటుగా టీమిండియాలోకి తీసుకోండి: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

  • జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్
  • అతడిలో రక్తం ఉరకలెత్తుతోందన్న శశిథరూర్
  • పంజాబ్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన ఉమ్రాన్ 
  • ఇంగ్లండ్‌ను బెంబేలెత్తిస్తాడన్న థరూర్
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీనగర్‌కు చెందిన రైటార్మ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. అతడిని వీలైనంత త్వరగా భారత జట్టులోకి తీసుకోవాలని కోరారు. అతడిలో రక్తం ఉరకలెత్తుతోందని, అతడో అద్భుతమైన ప్రతిభావంతుడని ప్రశంసించారు. టీమిండియాలో అతడికి చోటు కల్పించి ఇంగ్లండ్ తీసుకెళ్తే ఆంగ్లేయులను బెంబేలెత్తిస్తాడంటూ ట్వీట్ చేశారు.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ అద్భుత స్పెల్‌తో ఇరగదీశాడు. చివరి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే మూడు వికెట్లు తీశాడు. మొత్తంగా నాలుగు వికెట్లు తీసిన ఈ స్పీడ్‌స్టర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతేకాదు, చివరి ఓవర్‌లో మెయిడెన్ వేసిన నాలుగో బౌలర్‌గానూ ఉమ్రాన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఉమ్రాన్ కంటే ముందు ఇర్ఫాన్ పఠాన్, లసిత్ మలింగ, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.


More Telugu News