నెల్లూరు కోర్టులో చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశాం: ఎస్పీ విజయరావు

  • గతంలో కాకాణిపై సోమిరెడ్డి కేసు
  • నెల్లూరు కోర్టులో చోరీ
  • సోమిరెడ్డి కేసు పత్రాలు మాయం!
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బెంచ్ క్లర్క్
  • ఆత్మకూరు బస్టాండు వద్ద నిందితుల అరెస్ట్
నెల్లూరులో ఓ న్యాయస్థానంలో చోరీ జరగడం, మంత్రి కాకాణి గోవర్ధన్ పై గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నమోదు చేసిన కేసు తాలూకు పత్రాలు, వస్తువులు మాయం కావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దర్యాప్తు నేపథ్యంలో, జిల్లా ఎస్పీ విజయరావు మీడియాకు వివరాలు తెలిపారు. నెల్లూరు కోర్టులో చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు. వారు సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు తీసుకుని మిగతా పత్రాలను పడేశారని వెల్లడించారు. బెంచ్ క్లర్కు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని ఎస్పీ తెలిపారు. 

నిందితుల పేర్లు సయ్యద్ హయత్, ఖాజా రసూల్ అని తెలిపారు. వారిద్దరిపై 14 పాత కేసులు ఉన్నాయని వివరించారు. వారిని నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండు వద్ద అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఒక ల్యాప్ టాప్, ట్యాబ్, 4 సెల్ ఫోన్లు, 7 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ విజయరావు వివరించారు.


More Telugu News