ఏబీ డివిలియర్స్ గర్వపడతాడు: విరాట్ కోహ్లీ
- దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ పై మాజీ సారథి ప్రశంసలు
- నిన్న ఢిల్లీతో మ్యాచ్ అనంతరం డీకేని ఇంటర్వ్యూ చేసిన కోహ్లీ
- స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల కోసమే ఆడుతున్నానన్న డీకే
ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరఫున దినేశ్ కార్తీక్ తన బ్యాటింగ్ ఫైర్ వర్క్స్ ఘాటేంటో ప్రత్యర్థులకు చూపిస్తున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో అర్ధశతకం బాది జట్టుకు మంచి స్కోరు వచ్చేలా చూశాడు. మొత్తంగా ఓ ఫినిషర్ రోల్ ను సమర్థంగా నిర్వహిస్తున్నాడు. ఆరు మ్యాచ్ లలో 197 పరుగులు సాధించాడు. దాదాపు 200 స్ట్రైక్ రేట్ తో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే నిన్న మ్యాచ్ పూర్తయ్యాక డీకేని మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ చేశాడు.
‘‘ఈ రాత్రి వెరీ వెరీ స్పెషల్.. ఓ స్పెషల్ ఇంటర్వ్యూ’’ అంటూ కోహ్లీ స్టార్ట్ చేశాడు. తానెప్పుడూ ఇంటర్వ్యూ చేయలేదని, కానీ, స్పెషల్ నైట్ సందర్భంగా ‘మ్యాన్ ఆఫ్ ద ఐపీఎల్ మూమెంట్’ అయిన డీకేని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పాడు. చాలా అద్భుతంగా ఆడుతున్నావంటూ డీకేని ప్రశంసించాడు. బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం అలాగే కొనసాగుతుందని చెప్పాడు. మళ్లీ మళ్లీ ఇలా బ్యాటింగ్ చేస్తుంటే చూడాలని ఉందన్నాడు. 2013 నుంచి ఇప్పటిదాకా డీకేకి ఇదే బెస్ట్ ఐపీఎల్ అని చెప్పాడు. 2022 ఐపీఎల్ కు ఎలా ప్రిపేర్ అయ్యావ్? అని డీకేకి ప్రశ్న వేశాడు.
స్వల్పకాలిక, దీర్ఘకాలిక గోల్స్ పెట్టుకున్నా
తన కెరీర్ కు సంబంధించినంతవరకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకున్నానని డీకే చెప్పాడు. ఐపీఎల్ మెగా వేలం తర్వాత ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ తనకు ఫోన్ చేశాడని, ఏబీ డివిలియర్స్ లేని లోటును తీర్చాలంటూ చెప్పాడని గుర్తు చేశాడు. ఫినిషర్ జాబ్ ను పూర్తి చేయాలన్నాడని చెప్పాడు. స్వల్పకాలిక లక్ష్యం వెనుక దీర్ఘకాలిక దృక్పథం ఉందన్నాడు. తాను ఇంత బాగా ఆడడానికి కారణం సపోర్టింగ్ స్టాఫేనన్నాడు.
దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా తాను భారత్ కు ఆడాలనుకుంటున్నానని తెలిపాడు. త్వరలోనే వరల్డ్ కప్ జరగబోతోందని, ఈ క్రమంలోనే తనను తాను నిరూపించుకోవాలనుకున్నానని పేర్కొన్నాడు. భారత్ వరల్డ్ కప్ గెలిచి చాలా రోజులైపోయిందని, ఆ కప్ కోసమే తాను ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. వయసు పెరిగే కొద్దీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందని, అందుకోసం తాను చేయగలిగినదంతా చేస్తున్నానని వివరించాడు. రెండోసారి బెంగళూరు జట్టుకు ఆడుతున్నానని, కాబట్టి తాను ఏదైనా స్పెషల్ చేయాలనుకుంటున్నానని డీకే తెలిపాడు.
ఏబీడీ గర్వపడతాడు
అంత స్పష్టమైన దృక్పథం ఉండడం పట్ల డీకేని కోహ్లీ ప్రశంసించాడు. ఆర్సీబీ తరఫున చూపిస్తున్న ప్రదర్శనను పై వాళ్లు చూస్తారని, కచ్చితంగా దీర్ఘకాలిక లక్ష్యం నెరవేరుతుందని కోహ్లీ చెప్పాడు. ‘‘డీకే.. నీ బ్యాటింగ్ చూసి ఏబీ డివిలియర్స్ కచ్చితంగా గర్వపడతాడు. ప్రెటోరియాలో ఇంట్లో కూర్చుని మ్యాచ్ చూస్తూ అతడు నీ ఆట పట్ల గర్వంగా ఫీలవుతాడు’’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కచ్చితంగా డీకేకి సెలెక్టర్ల నుంచి పిలుపు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.