ఎంఎస్ ధోనీ లెగ్ స్పిన్ బౌలింగ్.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

  • నెట్ ప్రాక్టీస్ లో బంతి పట్టిన ధోనీ
  • సహచరులకు లెగ్ స్పిన్ బంతులు
  • అవసరం వస్తే బాల్ తీసుకుంటాడా?
  • అభిమానుల్లో కొత్త సందేహాలు
మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెప్టెన్ గా ఎన్నో విజయాలకు ఆయన చిరునామా. భారత్ కు రెండు ప్రపంచకప్ లు అందించడమే కాకుండా, ఐపీఎల్ లో చెన్నై జట్టుకు నాలుగు కప్ లు తెచ్చి పెట్టిన సారథి. ఇప్పుడు సారథ్య బాధ్యతలు రవీంద్ర జడేజాకు అప్పగించి, వెన్ను తట్టి నడిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం.

సారథి మారడం, కొత్త సారథికి తగినంత అనుభవం లేకపోవడం, జట్టులో పాత ముఖాలు కొన్ని వెళ్లి, కొత్త ఆటగాళ్ల రాకతో ఈ సీజన్ లో చెన్నై కేవలం ఒకే విజయంతో పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. నేడు గుజరాత్ టైటాన్స్ తో చెన్నై తలపడనుంది. ఇది ఆరో మ్యాచ్ అవుతుంది. ఈ ఆటకు ముందు ధోనీ నెట్ ప్రాక్టీస్ చూస్తే కొత్త సందేహాలు తలెత్తాయి. (వీడియో)

ధోనీ భారత జట్టు తరఫున బౌలింగ్ చేసిన సందర్భాలు అరుదు. నెట్ ప్రాక్టీస్ లో మాత్రం ఆయన బౌలింగ్ చేస్తూ గతంలోనూ కనిపించాడు. ఈ విడత కూడా నెట్ ప్రాక్టీస్ లో సహచరులకు లెగ్ స్పిన్ బౌలింగ్ వేశాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. అయితే ధోనీ కొత్త రూపానికి ఇది నాందీయా? చూడాల్సిందే. కేవలం నెట్ ప్రాక్టీస్ కే ధోనీ తన బౌలింగ్ పరిమితం చేస్తాడా..? లేక ఐపీఎల్ లో చెన్నై జట్టుకు అవసరం ఏర్పడితే బౌల్ తో ఆదుకునే వ్యూహం ఏమైనా ఉందా? అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.


More Telugu News