పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న కేంద్రమంత్రి మేఘ్వాల్
- అంబేద్కర్ జయంతి సందర్భంగా కార్యక్రమం
- మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో కుప్పకూలిన ఇనుప స్తంభం
- ఒకరి మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆగ్రాలోని భీంనగరి ప్రాంతంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఈదురు గాలులు కారణంగా లైట్లు అమర్చిన ఓ భారీ ఇనుప స్తంభం ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ఘటనలో స్టేజీపై ఉన్న రాజేశ్ కుమార్ (50) అనే స్థానికుడు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మాజీ ఎమ్మెల్యే గుటియారి లాల్ దూబేష్, ఆయన డ్రైవర్ కూడా ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి సురక్షితంగా తప్పించుకున్నారు.