తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!
- చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి
- ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- వర్షాలు పడే సమయంలో ఈదురు గాలులు
తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు పేర్కొంది.
దీని ప్రభావంతో రెండు రోజులపాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, వర్షాలు కురిసే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో రెండు రోజులపాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, వర్షాలు కురిసే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది.