మళ్లీ బ్యాట్ ఝళిపించిన దినేశ్.. ఢిల్లీ టార్గెట్ 190 పరుగులు
- నిరాశపరచిన డుప్లెసిస్, విరాట్
- చెలరేగిన గ్లెన్ మ్యాక్స్‌వెల్
- 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ తాజా సీజన్‌లో సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఢిల్లీ కేపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న దినేశ్... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏకంగా 66 పరుగులు రాబట్టాడు. 34 బంతులు ఎదుర్కొన్న దినేశ్... 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరలో దినేశ్ వీరోచిత బ్యాటింగ్ కారణంగానే బెంగళూరు జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
బెంగళూరు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కెప్టెన్ డుప్లెసిస్ (8), అనూజ్ రావత్ (0), విరాట్ కోహ్లీ (12)లు మరోమారు నిరాశపరిచారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెలరేగాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 189 పరుగులు చేసింది. ఢిల్లీ కేపిటల్స్‌కు 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.