ఐదేళ్లలో విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి
- విశాఖలో మెట్రో రైల్
- 76 కిలోమీటర్ల మేర మెట్రో వ్యవస్థ ఏర్పాటు
- 54 స్టేషన్లు, 2 డిపోలతో మెట్రో ప్రాజెక్టు
- రూ.14,309 కోట్ల వ్యయంతో అంచనాలు
విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ యూజేఎం రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ మహానగరంలో 76 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇందులో 54 స్టేషన్లు, రెండు డిపోలు ఉంటాయని చెప్పారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఐదేళ్లలో పూర్తవుతుందని తెలిపారు.
మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో రూ.14,309 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు అంచనాలు రూపొందించినట్టు వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టు నేపథ్యంలో, స్థానికుల స్థలాలకు, భవనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు యూజేఎం రావు స్పష్టం చేశారు.