ప్రతి గ్రామానికి ఈ మూడు అవసరం: ఆర్.నారాయణమూర్తి

  • రౌతులపూడి శివాలయం పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి
  • ప్రతి ఊరికి గుడి, బడి, ఆసుపత్రి ముఖ్యమని వ్యాఖ్య
  • గుడి ఉంటే జనాలకు పాపభీతి ఉంటుందన్న నారాయణమూర్తి
ప్రతి గ్రామానికి గుడి, బడి, ఆసుపత్రి ముఖ్యమని సినీనటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. తన స్వస్థలమైన రౌతులపూడిలో జరిగిన శివాలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఊరిలో గుడి ఉంటే పాపభీతి ఉంటుందని, మనుషులు తప్పులు చేయకుండా ఉంటారని చెప్పారు. 

ఇక బడి ఉంటే చదువు ద్వారా విద్య, జ్ఞానం, వికాసం వస్తాయని తెలిపారు. ఆసుపత్రి ఉంటే ఆనారోగ్యంతో బాధపడేవారు కూడా కుదుటపడతారని అన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ తరపున రూ. 55 లక్షలు మంజూరు చేశారని... ప్రస్తుత ప్రభుత్వంలో మాజీ అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజస్తంభం ఏర్పాటుకు తన శాఖ నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు ఇచ్చారని చెప్పారు.


More Telugu News