ఆడి నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ కారు... మహేశ్ బాబు ప్రచారం
- భారత్ లో ఆడి ఈ-ట్రాన్
- విద్యుత్ ఆధారిత కారు తీసుకువచ్చిన ఆడి
- సుస్థిర భవిష్యత్తును ఇంటికి తీసుకువద్దామన్న మహేశ్ బాబు
- సోషల్ మీడియాలో ప్రచారం
జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఆడి కొత్తగా విద్యుత్ ఆధారిత వాహనాలు తీసుకువస్తోంది. ఈ క్రమంలో భారత్ లో తన ఎలక్ట్రిక్ వాహనం ఈ-ట్రాన్ ను ప్రవేశపెడుతోంది. దీనికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో మహేశ్ బాబు ఈ మేరకు వాణిజ్య ప్రకటన చేశారు.
స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, సుస్థిర భవిష్యత్తును ఇంటికి తీసుకువద్దాం అని మహేశ్ పిలుపునిచ్చారు. ఉవ్విళ్లూరించే ఆడి కొత్త అనుభవం అంటూ తన పెయిడ్ పోస్టులో వివరించారు. ఈ మేరకు ఆడి ఈ-ట్రాన్ పక్కనే తాను నిల్చున్న ఫొటోను కూడా మహేశ్ బాబు పంచుకున్నారు.
కాగా, ఆడి ఈ-ట్రాన్ కారు ధర వివిధ వేరియంట్లను బట్టి రూ.1.01 కోట్లు, 1.19 కోట్లుగా నిర్ణయించారు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.
సింగిల్ ఫ్రేమ్ గ్రిల్, 20 అంగుళాల గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ స్ట్రిప్స్, 12 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఆడి వర్చువల్ కాక్ పిట్, 16 స్పీకర్ల ఒలుఫ్ సెన్ ఆడియో సిస్టమ్ (3డీ సరౌండ్ సౌండ్), పరిస్థితులకు తగిన విధంగా మారిపోయే లైటింగ్ వ్యవస్థ, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ గ్లాస్ సన్ రూఫ్ దీని ప్రత్యేకతలు. ఈ-ట్రాన్ ఫీచర్లను ఆడి కనెక్ట్ యాప్ తో అనుసంధానం చేసుకునే వీలుంది.