ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్... తొలిమ్యాచ్ లో ముంబయి, లక్నో అమీతుమీ
- టాస్ గెలిచిన ముంబయి
- బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
- ఇక ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ముంబయికి ప్లే ఆఫ్ చాన్స్
- నేటి రెండో మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ బెంగళూరు
వారాంతం కావడంతో ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడనున్నాయి.
కాగా, తొలి మ్యాచ్ కు ముంబయి బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై తాను ఆడే ప్రతి మ్యాచ్ ను ముంబయి జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అందుకే చావోరేవో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది.
ఇక ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టులో ఒక మార్పు చేశారు. భారీగా పరుగులు సమర్పించుకుంటున్న బాసిల్ థంపిని తొలగించారు. అతడి స్థానంలో ఫాబియెన్ అలెన్ ను జట్టులోకి తీసుకున్నారు. అటు, లక్నో జట్టులోనూ ఒక మార్పు చేశారు. గౌతమ్ స్థానంలో మనీష్ పాండేని తీసుకున్నారు.
ఇరుజట్ల పాయింట్లు చూస్తే... టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన లక్నో జట్టు 3 విజయాలు సాధించి 6 పాయింట్లు సొంతం చేసుకుంది. ముంబయి ఇండియన్స్ దారుణ రీతిలో 5 మ్యాచ్ లు ఆడి అన్నింటా ఓడిపోయింది. ఆ జట్టు ఇంకా పాయింట్ల ఖాతానే తెరవలేదు.
.