ఈసారి ఐపీఎల్ టోర్నీకి ముగింపు వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం

  • గత కొన్ని సీజన్లలో ముగింపు వేడుకలకు దూరం
  • దేశంలో సద్దుమణిగిన కరోనా పరిస్థితులు
  • టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ
  • ఏప్రిల్ 25 వరకు గడువు
  • మే 29న ఐపీఎల్-15 ఫైనల్ మ్యాచ్
దేశంలో కరోనా పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీకి ముగింపు వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈవెంట్ మేనేజ్ మెంట్ కోసం టెండర్లు ఆహ్వానించింది. 

ఈ టెండరు ప్రక్రియలో పాల్గొనదలచిన వారు రూ.1 లక్ష ఫీజు (నాన్ రిఫండబుల్)తో పాటు అదనంగా రూ.18 వేల జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ఏప్రిల్ 25వ తేదీ తుదిగడువు. తమకు అనుకూలమైన మొత్తానికి బిడ్ దాఖలు చేసినవారికి బీసీసీఐ ఐపీఎల్ క్లోజింగ్ సెర్మనీ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుంది. 

ఐపీఎల్ తాజా సీజన్ లో ఫైనల్ మ్యాచ్ మే 29న జరగనుంది. ఈ టైటిల్ సమరానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ ముగింపు వేడుకలు కూడా ఇక్కడే నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా, కరోనా వ్యాప్తి కారణంగా గత కొన్ని సీజన్లకు ముగింపు వేడుకలు నిర్వహించలేదు.


More Telugu News