గోవాలో చాలా చోట్ల మతమార్పిడిలు జరుగుతున్నాయి: సీఎం ప్రమోద్ సావంత్

  • మరోసారి మతం దాడికి గురవుతోంది
  • గ్రామాల్లోని దేవాలయ ట్రస్టులు అప్రమత్తంగా ఉండాలి
  • మతం సురక్షితంగా ఉంటే దేశం సురక్షితంగా ఉంటుంది
గోవాలో వివిధ ప్రాంతాల్లో మతమార్పిడులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆందోళన వ్యక్తం చేశారు. మతమార్పిడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మరోసారి మతం దాడికి గురవుతోందని, తాను అబద్ధం చెప్పడం లేదని అన్నారు. కుడ్నెమ్ దేవాలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మతమార్పిడుల వైపు వెళ్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నామని చెప్పారు. 

మతమార్పిడులను ప్రభుత్వం అనుమతించదని ప్రమోద్ సావంత్ చెప్పారు. గ్రామాల్లో ఉన్న దేవాలయ ట్రస్టులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 60 ఏళ్ల క్రితం పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాలో భగవంతుడు, మతం, దేశం అనే సెంటిమెంటుతో ముందుకు వెళ్లామని చెప్పారు. దేవుడు సురక్షితంగా ఉంటే మతం సురక్షితంగా ఉంటుందని, మతం సురక్షితంగా ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు. పేదరికం, వెనుకబడినతనం, ఆహార కొరత, నిరుద్యోగం, అల్ప సంఖ్యాకులుగా ఉండటం వంటి కారణాలతో చాలా మంది మతం మారుతున్నారని చెప్పారు.


More Telugu News