మద్యం మత్తులో గురుద్వారాలోకి వెళ్లారంటూ.. పంజాబ్ సీఎంపై పోలీసు కంప్లైంట్
- వైశాఖి పర్వదినాన ఘటన జరిగినట్టు ఆరోపణ
- పంజాబ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత బగ్గా
- శుక్రవారం ఇదే ఆరోపణతో మాన్‌పై ఎస్జీపీసీ ఆగ్రహం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై శనివారం ఆ రాష్ట్ర పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. మద్యం మత్తులో భగవంత్ మాన్ గురుద్వారాలోకి ప్రవేశించారని, దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీకి చెందిన యువ నేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా నేరుగా పంజాబ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భగవంత్ మాన్‌పై తాను పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రతులను బగ్గా సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఇదిలా ఉంటే... ఈ నెల 14న వైశాఖి సందర్భంగా తాగిన మత్తు ఇంకా దిగకుండానే గురుద్వారాలోకి ప్రవేశించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) భగవంత్ మాన్‌పై శుక్రవారం సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి భగవంత్ మాన్ క్షమాపణ చెప్పాలని కూడా ఎస్జీపీసీ డిమాండ్ చేసింది. తాజాగా అదే ఘటనను ప్రస్తావిస్తూ మాన్‌పై కేసు నమోదు చేయాలంటూ బగ్గా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.