ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు
- రెండో రోజు పాదయాత్ర కొనసాగించిన బండి సంజయ్
- తెలంగాణను సాధించుకున్నది కేసీఆర్ కుటుంబం కోసమా? అంటూ ప్రశ్న
- కేసీఆర్‌ను ఫామ్ హౌజ్ నుంచి బయటకు రప్పించామని వ్యాఖ్య
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రను శుక్రవారం రెండో రోజు కొనసాగించారు. పాలమూరు జిల్లాలో యాత్రను కొనసాగించిన బండి సంజయ్.. కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించే సమయం వచ్చిందని అన్నారు. పాలమూరులో చిచ్చు పెట్టడానికి తాము యాత్ర చేస్తున్నామని టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు.
ఓ వైపు నీళ్లు రావడం లేదని పాలమూరు ప్రజలు చెబుతుంటే... పచ్చటి పాలమూరు ఎక్కడుందో కేటీఆరే చెప్పాలని సంజయ్ వ్యాఖ్యానించారు. ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్‌ను బయటకు రప్పించింది తామేనని, కేసీఆర్ దేశమంతా తిరగడానికి కూడా కారణం తామేనని అన్నారు. ఇచ్చిన మాట మేరకు ఎస్సీని సీఎం చేయని కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తామంటూ ప్రకటన చేయడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్నది కేసీఆర్ కుటుంబం కోసమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.