ఒంటిమిట్ట కోదండరాముడ్ని దర్శించుకున్న సీఎం జగన్
- నేడు ఒంటిమిట్టలో కల్యాణోత్సవం
- విచ్చేసిన సీఎం జగన్
- స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పణ
- కాసేపట్లో కల్యాణోత్సవం
ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో నేడు శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు సీఎం జగన్ కొద్దిసేపటి కిందట ఒంటిమిట్ట చేరుకున్నారు. ఆయనకు కోదండరామస్వామి ఆలయంలో మంత్రి రోజా, అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ శ్రీరాముడికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కోదండరాముని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ పంచెకట్టులో ఆలయ ప్రవేశం చేశారు. స్వామివారిని దర్శించుకున్న సీఎం జగన్, కల్యాణ వేదిక వద్దకు తరలివెళ్లనున్నారు. తిరుమల నుంచి వచ్చిన వేదపండితుల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించనున్నారు.
అటు, టీటీడీ కూడా ఒంటిమిట్ట కోదండరామునికి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు అందించింది. మూల విరాట్టుకు ఒక కిరీటం, ఉత్సవమూర్తులకు 3 కిరీటాలు సమర్పించింది.
అటు, టీటీడీ కూడా ఒంటిమిట్ట కోదండరామునికి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు అందించింది. మూల విరాట్టుకు ఒక కిరీటం, ఉత్సవమూర్తులకు 3 కిరీటాలు సమర్పించింది.