అమెరికా గ‌డ్డ‌పై నుంచి చైనాకు రాజ్ నాథ్ గట్టి హెచ్చరిక

  • అమెరికా ప‌ర్య‌ట‌న‌లో రాజ్ నాథ్ సింగ్‌
  • భార‌త కాన్సులేట్ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌రు
  • భార‌త్‌కు హాని త‌ల‌పెట్టే పొరుగు దేశాల‌ను ఉపేక్షించేది లేద‌ని ప్ర‌క‌ట‌న‌
అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భార‌త్‌కు హాని త‌ల‌పెట్టాల‌ని చూసే ఏ ఒక్క‌రిని కూడా వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని రాజ్ నాథ్ కీల‌క వ్యాఖ్య చేశారు. తూర్పు లడఖ్ విష‌యంలో చైనాను ఉద్దేశించే రాజ్ నాథ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల‌పై చ‌ర్చ‌ల కోసం భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌తో క‌లిసి రాజ్ నాథ్ సింగ్ ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని భార‌త కాన్సులేట్ కార్యాల‌యం శుక్ర‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త స‌రిహ‌ద్దుల్లో పొరుగు దేశాల అత్యుత్సాహంపై స్పందించిన రాజ్ నాథ్ చైనాను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌రిహ‌ద్దుల్లో భార‌త సైనికుల‌ వీరోచిత సేవ‌ల‌ను ఆయ‌న కీర్తించారు.


More Telugu News