నెల్లూరు కోర్టులో చోరీ వ్య‌వ‌హారంపై సోమిరెడ్డి స్పంద‌న ఇదే

  • కాకాణి ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన సోమిరెడ్డి
  • చిన్న బ‌జార్ పోలీస్ స్టేష‌న్‌కు స్వ‌యంగా వెళ్లిన మాజీ మంత్రి
  • న‌కిలీ ప‌త్రాల‌తో త‌న ఇమేజీని దెబ్బ‌తీశార‌ని ఆరోప‌ణ‌
నెల్లూరులోని కోర్టులో చోరీ ఘ‌ట‌న ఏపీలో కలకలం రేపింది. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి కాసేప‌టి క్రితం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకునేందుకు న‌గ‌రంలోని చిన్న బ‌జార్ పోలీస్ స్టేష‌న్‌కు స్వ‌యంగా వెళ్లిన సోమిరెడ్డి.. అక్క‌డ పోలీసుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ త‌ర్వాత పోలీస్ స్టేష‌న్ వెలుప‌ల మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌ల‌పై సోమిరెడ్డి స్పందించారు.

ఈ సంద‌ర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ .. "విదేశాల్లో నా కుటుంబానికి 1,000 కోట్లు ఉన్నాయ‌న్నారు. న‌కిలీ ప‌త్రాల‌తో నా ఇమేజీని దెబ్బ‌తీశారు. కాకాణిపై కేసును ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. అందుకు హైకోర్టు అనుమ‌తి ఉండాల‌ని జ‌డ్జి చెప్పారు. ఈ కేసులో మాకు న‌మ్మ‌కం ఉంది. నిందితుల‌కు శిక్ష ప‌డుతుంది" అని సోమిరెడ్డి అన్నారు.


More Telugu News