ఏకంగా కోర్టుల్లోనే చోరీలు చేస్తూ ఆధారాలు మాయం చేస్తున్నారు: నారా లోకేశ్
- నాడు కాకాణిపై సోమిరెడ్డి కేసు
- ఆ కేసుకు సంబంధించిన పత్రాలే తాజాగా చోరీ
- పత్రాలు, ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లిన దొంగలు
- మంత్రిపదవి పోతుందని భయపడ్డారన్న లోకేశ్
వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాఖలు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు నెల్లూరు కోర్టులో చోరీకి గురికావడం తెలిసిందే. దీనిపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. జగన్ పరిపాలనలో న్యాయస్థానాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఏకంగా కోర్టుల్లోనే చోరీలు చేస్తూ ఆధారాలనే మాయం చేస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు.
కాకాణిపై నకిలీ పత్రాల కేసును విత్ డ్రా చేయించాలని చూశారని, ఇప్పుడు కేసు విచారణ ప్రారంభమైతే మంత్రి పదవి పోతుందని భయపడ్డారని లోకేశ్ ఆరోపించారు. కీలక పత్రాలు, ల్యాప్ టాప్ ను ఎత్తుకెళ్లిన దొంగలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.