టిఫిన్ ఆలస్యం చేసిందని.. కోడలిని కాల్చి చంపిన మామ!
- మహారాష్ట్రలోని థానేలో ఘోరం
- లైసెన్స్ డ్ రివాల్వర్ తో కాల్పులు
- చికిత్స పొందుతూ మరణించిన ఇల్లాలు
- నిందితుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు
బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం కావడం ఆ ఇల్లాలి ప్రాణాన్ని బలి తీసుకుంది. టిఫిన్ చేసే వరకు ఓపిక పట్టలేని మామ సొంత కోడలిపైనే కాల్పులు జరిపి పరారయ్యాడు. మహారాష్ట్రలోని థానేలో ఈ దారుణం జరిగింది.
పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. సీమా రాజేంద్ర గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేస్తోంది. ఆమె మామ కాశీనాథ్ పాటిల్ (76) ఓ వ్యాపారవేత్త. తనకు సమయానికి టిఫిన్ పెట్టలేదన్న కోపంతో లైసెన్స్ డ్ రివాల్వర్ బయటకు తీసి కోడలి పొట్ట భాగంలో కాల్చి పరారయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు.
గాయపడిన సీమా రాజేంద్రను థానేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తున్న క్రమంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె మరణించినట్టు శుక్రవారం ఉదయం వైద్యులు ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు పోలీసులు వెల్లడించారు.